రాష్ట్రంలో కొత్తగా 922 కరోనా కేసులు.. 7 మరణాలు - తెలంగాణ కరోనా బులెటిన్
09:07 November 02
రాష్ట్రంలో కొత్తగా 922 కరోనా కేసులు.. 7 మరణాలు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా వెయ్యికి దిగువగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 922 మందికి పాజిటివ్ తేలింది. ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,40,970కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య 1,348కి చేరింది.
కరోనా బారి నుంచి ఆదివారం 1,456 మంది కోలుకోగా..ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,21,992కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,630 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 14,717 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 256 కేసులు నమోదయ్యాయి.