ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్(ts eamcet counselling) ప్రక్రియ పూర్తైంది. ప్రత్యేక విడత కౌన్సిలింగ్ సీట్ల(ts eamcet seat allotment 2021)ను ఇవాళ(నవంబర్ 24) కేటాయించారు. కన్వీనర్ కోటా(convenor quota seats in engineering)లో 57,177 ఇంజినీరింగ్ సీట్లు భర్తీ కాగా... ఇంకా 22,679 సీట్లు మిగిలిపోయాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 4674 సీట్లను కేటాయించారు. కంప్యూటర్, ఐటీ కోర్సుల్లో 90 శాతానికి పైగా సీట్లు(ts eamcet seat allotment 2021) భర్తీ అయ్యాయి.
TS EAMCET Counselling: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పూర్తి.. 90 శాతం సీట్లు భర్తీ..
ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్(ts eamcet counselling) ప్రక్రియ పూర్తైంది. కంప్యూటర్, ఐటీ కోర్సుల్లో 90 శాతానికి పైగా సీట్లు(ts eamcet seat allotment 2021) భర్తీ అయ్యాయి. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ అభ్యర్థుల కోటాకు మాత్రం స్పందన కరవైంది.
90 percent seats fill up in TS EAMCET Counselling 2021
మరోవైపు.. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ అభ్యర్థుల కోటాకు మాత్రం స్పందన కరవైంది. కేవలం 177 బీ ఫార్మసీ, 223 ఫార్మ్‌డీ సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారు ఈ నెల 26వ తేదీలోగా కళాశాలల్లో చేరాలని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. కళాశాలల్లో ధ్రువపత్రాల జిరాక్స్‌లు మాత్రమే ఇవ్వాలని సూచించారు. టీసీ మాత్రమే ఒరిజినల్ ఇవ్వాలని నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: