తెలంగాణ

telangana

ETV Bharat / city

Rains in andhra pradesh today: చిత్రావతి నదిలో చిక్కుకున్న జేసీబీ.. సాయం కోసం 9మంది ఎదురుచూపు - telangana news

ఏపీలోని వెల్దుర్తి వద్ద చిత్రావతి నది ప్రవాహంలో ప్రయాణికులతో సహా చిక్కుకుపోయిన కారును బయటకు తీసిన ఓ పొక్లెయిన్‌ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. పొక్లెయిన్​లో తొమ్మిది మంది ఉన్నారు. బాధితులను కాపాడేందుకు విపత్తు నిర్వహణ బృందాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

Rains in andhra pradesh today, ap rains news
చిత్రావతి నదిలో చిక్కుకున్న జేసీబీ, ఆంధ్రప్రదేశ్​లో వర్షాలు

By

Published : Nov 19, 2021, 1:39 PM IST

అనంతపురం జిల్లా డీకే పల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నది ప్రవాహంలో ప్రయాణికులతో సహా చిక్కుకుపోయిన కారును బయటకు తీసిన ఓ పొక్లెయిన్‌ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. పొక్లెయిన్​లో తొమ్మిది మంది ఉన్నారు. వరద ప్రవాహం మధ్యలో పొక్లెయిన్‌పైనే చిక్కుకుపోయిన 9 మందిని కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

వరదలో చిక్కుకున్న వృద్ధులు..

కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ వద్ద మద్ధిలేరు వాగు ప్రవాహంలో ఇద్దరు వృద్ధులు చిక్కుకున్నారు. వారిని అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడారు. ఎర్రదొడ్డి గంగమ్మ వద్ద నిర్మించిన సత్రాల కాపలా దారులుగా ఈ ఇద్దరు వృద్ధులు ఉంటున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల(Rains in andhra pradesh) ప్రభావంతో మద్ది లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహం అంతకంతకూ పెరిగి వృద్ధులు ఉంటున్న నివాసాన్ని చుట్టుముట్టాయి. భయాందోళనకు గురైన వృద్ధులు సమస్యను ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయం ఈవోకు సమాచారమిచ్చారు. వృద్ధులు వరదనీటి ప్రవాహంలో చిక్కుకున్న విషయం అగ్నిమాపక శాఖ అధికారులకు తెలిసింది. దాంతో ప్రవాహంలో చిక్కుకున్న వృద్ధుల ఇద్దరిని సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. వృద్ధులను కాపాడిన అగ్నిమాపక సిబ్బందిని ఎస్​ఐ సాగర్​ అభినందించారు.

చిత్రావతి నదిలో చిక్కుకున్న జేసీబీ

ఏపీలో వాన బీభత్సం

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా తిరుచానూరులోని వసుంధర నగర్​లో భవనం నేలకూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కలికిరిలోని మదనపల్లి -తిరుపతి ప్రధాన రహదారిపై కలికిరి పెద్ద చెరువు మొరవ నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో రాకపోకలను దారి మళ్లించారు. రేణిగుంటలోని ఓ చర్చిలో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడ వద్ద వంతెన కూలిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. సమీపంలోని శివాలయం నీట మునిగింది.

చిత్తూరులో భయోత్పాతం

కుండపోత వర్షంతో ఏపీ చిత్తూరు జిల్లా (chittoor district)లోని తిరుమల( heavy rains in tirumala) గిరులు భయోత్పాతాన్ని సృష్టించాయి. ఆలయ పరిసరాలన్నీ వరద నీటి(flood water) తో నిండిపోయాయి. మాడవీధులన్నీ వాగులను తలపించాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తిరుమల (tirumala) పరిస్థితులు భయనకమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లోకి నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పోటెత్తిన వరద, బురద నారాయణగిరి వసతి సముదాయంలోకి చేరింది.

విరిగిపడిన కొండచరియలు..

కనుమదారుల్లో వరద నీరు జలపాతాల (Waterfalls) మాదిరిగా పడుతుండటంతో కొండచరియలు ( landslides Broken ) విరిగిపడుతున్నాయి. రెండో కనుమదారిలో 14 చోట్ల కొండచరియలు పడ్డాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ మార్గాలను ఇప్పటికే మూసివేసిన తితిదే (ttd)... శుక్ర, శనివారాలు సైతం అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వన్యమృగాలు సైతం వరద భయంతో రోడ్లపైకి చేరాయి.

ఇదీ చదవండి:Heavy rain in kadapa: కడప జిల్లాలో భారీ వర్షాలు.. ఉద్ధృతంగా పింఛ, అన్నమయ్య జలాశయాలు

ABOUT THE AUTHOR

...view details