AP corona cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 840 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి.. విశాఖ జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. తాజాగా.. మరో 133 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 37,849 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2,972 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
సునామిలా కరోనా
India covid cases: మరోవైపు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో కరోనా.. సునామిలా దూసుకుపోతుంది. రోజు వ్యవధిలోనే రెట్టింపు వేగంతో కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే.. 1,17,100 మందికి వైరస్ సోకింది. గతేడాది జూన్ 7 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వైరస్ ధాటికి మరో 302 మంది చనిపోయారు. 30,836 మంది కొవిడ్‌ను జయించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 7.74 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.