రాష్ట్రంలో గడచిన వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 837 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 2,32,671కి పెరిగింది. గత వారంలో వర్షాలు, వరదలు, పండుగల నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది.
గత రెండు మూడు నెలలుగా నిత్యం సుమారు 40 నుంచి 50వేలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా.. గత వారం రోజులుగా మాత్రం రోజుకి 25 వేల పరీక్షలు మాత్రమే చేస్తున్నట్లు సమాచారం. కేసుల తగ్గుదలకు ఇదీ కారణంగా అధికారిక లెక్కల ద్వారా స్పష్టమవుతోంది.
తాజాగా 1,554 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 2,13,466 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. కరోనా కోరల్లో చిక్కుకొని నలుగురు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1,315కి పెరిగింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 17,890 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 14,851 మంది ఐసోలేషన్లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 చోట్ల ఆర్టీపీసీఆర్, 1,076 కేంద్రాల్లో యాంటీ జెన్, 46 ప్రైవేటు ల్యాబుల్లోనూ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 7, భద్రాద్రి కొత్తగూడెం 48, జీహెచ్ఎంసీ 185, జగిత్యాల 14, జనగామ 8, జయశంకర్ భూపాలపల్లి 6, జోగులాంబ గద్వాల 9, కామారెడ్డి 22, కరీంనగర్ 51, ఖమ్మం 76, కుమరంభీం ఆసిఫాబాద్ 5, మహబూబ్నగర్ 15, మహబూబాబాద్ 10, మంచిర్యాల 11, మెదక్ 28, మల్కాజిగిరి 41, ములుగు 9, నాగర్కర్నూల్ 31, నల్గొండ 16, నారాయణ పేట 1, నిర్మల్ 8, నిజామాబాద్ 13, పెద్దపల్లి 7, రాజన్న సిరిసిల్ల 18, రంగారెడ్డి 59, సంగారెడ్డి 10, సిద్దిపేట 40, సూర్యాపేట 16, వికారాబాద్ 8, వనపర్తి 10, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 34, యాదాద్రి భువనగిరిలో 12 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి:వచ్చే వారంలోనే అందుబాటులోకి ఆక్స్ఫర్డ్ టీకా!