Numaish in Hyderabad 2022: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 81వ నుమాయిష్ ప్రారంభమైంది. నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. 45 రోజుల పాటు 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన సాగనుంది. ఈసారి ఒమిక్రాన్ దృష్ట్యా.. స్టాళ్ల సంఖ్యను 1600కు తగ్గించారు. ప్రదర్శనలో పలు అకాడమీలకు చెందిన పుస్తకాలతో పాటు రకరకాల వస్తువులు, రుచికరమైన ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. వాక్సిన్ తీసుకొని వాళ్ల కోసం నుమాయిష్‌లోనూ టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
వాళ్లను అనుమతించొద్దు..
నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు ఎంతో చరిత్ర ఉందని గవర్నర్ తమిళిసై తెలిపారు. ప్రదర్శనలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ నుంచి కూడా వ్యాపారులు రావటం నుమాయిష్ ప్రాధాన్యతను తెలియజేస్తోందని కొనియాడారు. ఎగ్జిబిషన్‌లో వాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని తమిళిసై అభినందించారు.