Contempt of Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎం.ఎం. నాయక్‌కు రెండు వారాలు జైలుశిక్షతో పాటుగా జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. వెంటనే ఐఏఎస్‌లు క్షమాపణ కోరడంతో జైలుశిక్ష తప్పించి.. సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని ఐఏఎస్‌లను ఆదేశించింది. విద్యార్థుల మధాహ్నం, రాత్రి భోజన ఖర్చులు భరించాలని తీర్పు వెల్లడించింది. సామాజిక సేవకు అంగీకరిస్తే క్షమాపణలను అంగీకరిస్తామని పేర్కొంది. సామాజిక సేవ చేసేందుకు 8 మంది ఐఏఎస్‌లు సిద్ధపడినట్లు వెల్లడించడంతో జైలుశిక్ష విధింపు తీర్పును సవరించినట్లు హైకోర్టు పేర్కొంది.
Contempt of Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కానీ - IAS officers jail for contempt of court
Contempt of Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. వెంటనే ఐఏఎస్‌లు క్షమాపణ కోరడంతో జైలుశిక్ష తప్పించి.. సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది.
Contempt of Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కానీ
సుమోటాగా స్వీకరించిన హైకోర్టు..: ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాలను తొలగించాలని 2020లో ఇచ్చిన ఉత్తర్వులను ఏడాదిపాటు అధికారులు పట్టించుకోకపోవడంతో సుమోటాగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగా అధికారులు కోర్టు ఉత్తర్వుల అమలును నిర్లక్ష్యం చేశారన్న కారణంతో 8 మంది ఐఏఎస్‌లకు రెండు వారాలు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఇదీ చదవండి: