తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - today horoscopes news

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

7th may 2021 horoscopes news today
ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!

By

Published : May 7, 2021, 7:03 AM IST

ఒక వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలతో మంచి జరుగుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. సమయానికి నిద్రాహారాలు అవసరం. శివారాధన శుభప్రదం

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగ్రహావేశాలకు పోకూడదు. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవాలి.

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శివారాధన శుభప్రదం.

బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

అనుకున్న పనిని వెంటనే పూర్తి చేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజనంసౌఖ్యం కలదు. ప్రశాంతమైన జీవనం ఉంది. లక్ష్మీ ఆరాధన మంచిది.

అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలు లభించడం వల్ల సంతోషంగా ఉంటారు. దుర్గాస్తుతి పఠించాలి.

అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మంచినిస్తాయి.

మనః సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ధన,ధన్య లాభాలు ఉన్నాయి. సత్యనిష్ఠతో విజయసిద్ధి ఉంది. లక్ష్మీధ్యానం శుభప్రదం

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నారాయణ మంత్రాన్ని జపించాలి.

మీ మీ రంగాల్లో మీ శక్తిసామర్ధ్యాలు పెరుగుతాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. గణపతిని పూజిస్తే మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అన్నివిధాలా బాగుంటుంది. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

ఇదీ చూడండి:రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించలేం: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details