తెలంగాణ

telangana

ETV Bharat / city

AP CORONA CASES: ఏపీలో 749 కరోనా కేసులు నమోదు - ఏపీ కరోనా వార్తలు

AP CORONA CASES: ఆంధ్రప్రదేశ్​లో కొవిడ్​ విజృంభణ తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కేవలం 749 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 18,929 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

AP CORONA CASES
AP CORONA CASES

By

Published : Feb 13, 2022, 9:51 PM IST

AP CORONA CASES: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,785 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 749 కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి 6,271 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 18,929 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

ఏపీ వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్​

దేశంలో 50వేల దిగువకు రోజువారీ కరోనా​ కేసులు..
Corona cases in India: భారత్​లో కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 44,877 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,17,591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 1.43 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు:4,26,31,421
  • మొత్తం మరణాలు:5,08,665
  • యాక్టివ్ కేసులు:5,37,045
  • మొత్తం కోలుకున్నవారు:4,15,85,711

దేశంలో కొత్తగా 49,16,801 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,81,49,447 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీచూడండి:CM KCR Comments: కేంద్రాన్ని జైలుకు పంపేది మాత్రం పక్కా: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details