TS CORONA CASES: రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు - తెలంగాణ కరోనా కేసుల వార్తలు
20:07 June 27
రాష్ట్రంలో కొత్తగా 748 కరోనా కేసులు, 8 మరణాలు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా వెయ్యిలోపే కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 81,405 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 748 మంది వైరస్ (CORONA POSITIVE) బారినపడినట్లు వెల్లడయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 121 మందికి వైరస్ సోకింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 8 మంది మరణించారు.
రాష్ట్రంలో మరో 1,492 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 14,302 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి.