AP Corona Cases: ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 6,996 మందికి వైరస్ సోకగా.. నలుగురు మృతి చెందారు. కొత్తగా కరోనా నుంచి 1,066 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 38,055 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారిగా కేసులు
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,534 కరోనా కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 1,263, గుంటూరులో 758, శ్రీకాకుళం జిల్లాలో 573, అనంతపురం జిల్లాలో 462, ప్రకాశం జిల్లాలో 424 మందికి కొవిడ్ సోకింది.
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,38,018 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 310 మంది మరణించారు. 1,57,421 మంది కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 94.03 శాతం నమోదైందని పేర్కొంది. అయితే.. యాక్టివ్ కేసుల సంఖ్య కొత్తగా 80,287 పెరగడం ఆందోళన చెందాల్సిన అంశమని వెల్లడించింది.
- మొత్తం కేసులు:3,76,18,271
- మొత్తం మరణాలు:4,86,761
- యాక్టివ్ కేసులు:17,36,628
- మొత్తం కోలుకున్నవారు:3,53,94,882
corona cases in world:ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 19,79,856 మందికి కరోనా సోకింది. 4,987 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 33,12,64,767కి చేరగా.. మరణాలు 55,63,226కు పెరిగింది.
- అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 3,89,553 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 468 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.7 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 1,02,144 కేసులు వెలుగుచూశాయి. మరో 296 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో మరో 84,429 మంది వైరస్ బారిన పడ్డారు. 85 మంది మృతి చెందారు.
- ఇటలీలో 83,403 కొత్త కేసులు బయటపడగా.. 287 మంది మరణించారు.
- స్పెయిన్‌లో 1,10,489 మందికి కొత్తగా వైరస్ సోకింది. మరో 78 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 76,345 మందికి సోకగా.. 162 మంది వైరస్‌తో చనిపోయారు.
- అర్జెంటీనాలో తాజాగా 1,02,458 కరోనా కేసులు బయటపడగా.. 191 మంది బలయ్యారు. జర్మనీలో 53,916 మందికి వైరస్ సోకింది. మరో 143 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి:డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావుకు కరోనా నిర్ధరణ