హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 69 పెండింగ్ చలానాలు ఉన్న ఓ ద్విచక్రవాహనదారుడు సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఇన్స్పెక్టర్ సుమన్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిసున్నారు. ఇంతలో ద్విచక్రవాహనం(టీఎస్12ఈజీ- 8524)పై అటుగా వచ్చిన పాతబస్తీ మచలికమాన్ ప్రాంతానికి చెందిన రిషబ్గుప్తాను నిలిపారు.
ఒకే బండిపై ఏకంగా 69 చలానాలు
ఎదైనా అత్యవసరమైన పని ఉంటేనో... తొందరపాటులోనో సిగ్నల్ జంప్ చేయటం... మరిచిపోయి హెల్మెట్ పెట్టుకోకపోవటం వంటి ఉల్లంఘనలు ఒకటి రెండు ఉంటే ఏమో అనుకోవచ్చు. కానీ.. ఓ ప్రబుద్ధుని బండిపై ఏకంగా 69 చలానాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని సుల్తానాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు ఈ చలానాల ధీరుడు.
69 pending challans pending on scooty
వాహనం నంబర్‌పై 69 చలానాలతో సుమారు రూ.21,270 పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ చలానాలకు సంబంధించి మొత్తం బిల్లును వాహనదారుడు చెల్లించగా... బండిని విడుదల చేసినట్లు ఇన్స్పెక్టర్ సుమన్‌కుమార్ తెలిపారు.