ఏపీలో 24 గంటల వ్యవధిలో 1,02,876 మందికి పరీక్షలు చేయగా.. 6,770 మందికి పాజిటివ్‌గా తేలింది. మహమ్మారి సోకి మరో 58 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12మంది మృతి చెందారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,199, చిత్తూరు జిల్లాలో 968 కరోనా కేసులు నమోదవ్వగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 765, ప్రకాశం జిల్లాలో 530 కరోనా కేసులు వెలుగు చూశాయి.
Ap Corona cases: కొత్తగా 6,770 కరోనా కేసులు, 58 మరణాలు - ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,02,876 పరీక్షలు నిర్వహించగా.. 6,770 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,09,844 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 6,770 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా నుంచి మరో 12,492 మంది కోలుకోగా.. ప్రస్తుతం 85,637 యాక్టివ్ కేసులున్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ