ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 664 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 835 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 8.56 లక్షల మందికి చేరింది.
ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు నమోదు - ఏపీ కరోనా వార్తలు
ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,70,076 చేరింది. మహమ్మారితో 7,014 మంది మరణించారు.
coronavirus
తాజాగా వైరస్ కారణంగా 11 మంది మృతి చెందగా.. మెుత్తం మరణాల సంఖ్య 7,014 చేరాయి. ప్రస్తుతం 6,742 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 63,049 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 1,02,29,745 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.
ఇదీ చదవండి:'లెక్కింపు ప్రక్రియను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలి'