రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు - covid 19 death stats telangana
21:02 May 25
రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో మరో 66 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనాతో మరో ముగ్గురు చనిపోయారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో 15 మంది, విదేశాల నుంచి వచ్చిన 18 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 1,920కి చేరాయి. ఆస్పత్రిలో చికిత్స నుంచి కోలుకుని 72 మంది డిశ్ఛార్జి కావడంతో ఈ సంఖ్య 1,164గా నమోదైంది. మరో 700 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 56కి చేరింది.