ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 8,67,063కు చేరింది. వైరస్ బారిన పడి మరో ఐదుగురు మృతి చెందగా... ఆ రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 6,981గా నమోదైంది. మరో 1,186 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ఏపీలో కొత్తగా 625 కరోనా కేసులు, 5 మరణాలు - ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల వార్తలు
ఏపీలో కొత్తగా 625 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,67,063కు చేరింది. ఇవాళ కొత్తగా మరో ఐదుగురు వైరస్ బారిన పడి మృతి చెందారు.
ఏపీలో కొత్తగా 625 కరోనా కేసులు, 5 మరణాలు
ప్రస్తుతం 11,571 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 49,348 కరోనా పరీక్షలు చేయగా.... ఇప్పటివరకు 99.62 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇవీ చూడండి: భారత్ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని.. కొవాగ్జిన్ సన్నద్ధతపై పరిశీలన