కరోనా మహమ్మారి రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. గత నెల తొలిసారిగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన కరోనా... ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో విస్తరించింది. ఆదివారం 62 కేసులు నమోదవ్వగా ఆ సంఖ్య 334కు పెరిగింది. గత ఐదు రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య దాదాపు మూడింతలు పెరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 107. అందులో ఐదుగురు మృతి చెందగా... 14 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జయ్యారు.
రాష్ట్రంలో మరో 62 కరోనా పాజిటివ్ కేసులు - coronavirus precautions
22:24 April 05
రాష్ట్రంలో మరో 62 కరోనా పాజిటివ్ కేసులు
ఇక ఈ ఐదు రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 334కి పెరిగింది. వీరిలో 33మంది కోలుకుని డిశ్చార్జి కాగా... 11మంది మృతి చెందారు. ప్రస్తుతం 290మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనాకి చికిత్స పొందుతున్నారు. అంటే గత నెలతోపోలిస్తే ఈ ఐదు రోజుల్లో అదనంగా 227మందిలో కరోనా నిర్ధరణ అయ్యింది.
దిల్లీ నుంచి వచ్చిన వారే..
మరోవైపు వీరిలో అత్యధికులు దిల్లీ నుంచి వచ్చిన వారే కావటం గమనార్హం. మర్కజ్ ఘటన వెలుగుచూసిన నాటి నుంచి దిల్లీ నుంచి వచ్చిన వారిపై సర్కార్ దృష్టి సారించింది. వారితోపాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తోంది. నాటి నుంచే కేసులు గరిష్ఠ స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. ఇక ఇప్పటికే మర్కజ్ వెళ్లిన వారిలో దాదాపు పరీక్షలు పూర్తికాగా వారి కుటుంబ సభ్యుల్లో కొందరికి పరీక్షలు ఇంకా చేయాల్సి ఉన్నట్టు సమాచారం.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో కమ్యునిటీ ట్రాన్స్మిషన్ మాత్రం అవ్వలేదని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 6 ల్యాబ్‌లలో దాదాపు రోజుకు 1500కి పైగా కరోనా పరీక్షలు చేస్తున్నట్టు పేర్కొంది. జాగ్రత్తలు పాటిస్తూ.. లాక్‌డౌన్‌కు సహరిస్తే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని పేర్కొంది.
జిల్లాల వారిగా వివరాలు
జిల్లా | కేసుల |
హైదరాబాద్ | 145 |
వరంగల్ అర్బన్ | 23 |
నిజామాబాద్ | 19 |
నల్గొండ | 13 |
మేడ్చల్ | 12 |
కామారెడ్డి | 8 |
రంగారెడ్డి | 11 |
ఆదిలాబాద్ | 10 |
సంగారెడ్డి | 7 |
జోగులాంబ గద్వాల | 5 |
మెదక్ | 5 |
భద్రాద్రి కొత్తగూడెం | 3 |
జగిత్యాల | 2 |
జనగామ | 2 |
నాగర్‌కర్నూల్ | 2 |
వికారాబాద్ | 4 |
మహబూబాబాద్ | 1 |
జయశంకర్ | 1 |
సిద్దిపేట | 1 |
సూర్యాపేట | 2 |
ములుగు | 2 |
నిర్మల్ | 1 |
ఇవీ చూడండి:'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'