తెలంగాణ

telangana

ETV Bharat / city

రావులపాలెంలో కరోనా కలవరం.... ఒక్కరోజే 60 కేసులు - ap coronavirus news

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఒక్కరోజులోనే 60 కొత్త కేసులు నమోదయ్యాయి. 250 మంది కరోనా పరీక్షలు చేయగా 60 పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. రావులపాలెం మండలంలో కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ వచ్చిన వారిసంఖ్య 128కి చేరింది.

coronavirus
coronavirus

By

Published : Jul 21, 2020, 1:10 PM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఏకంగా ఒక్కరోజులోనే 60 కేసులు నమోదయ్యాయి.

రావులపాలెం మండలం ఊబలంక, గోపాలపురం పీహెచ్ సీలో 250 పరీక్షలు నిర్వహించగా 60 పాజిటివ్ కేసులు వచ్చినట్లు పీహెచ్​సీ అధికారులు దుర్గాప్రసాద్, ఇందుశ్రీలు వెల్లడించారు. ఇప్పటికే మండలంలో 68 కేసులు ఉండగా వీటితో కలిపి 128 కేసులు అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details