తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా అలజడి: ఏపీలో 19కి చేరిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరో 6 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

corona cases in andhra
కరోనా అలజడి: రాష్ట్రంలో 19కి చేరిన పాజిటివ్ కేసులు

By

Published : Mar 29, 2020, 7:10 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం గుంటూరు జిల్లాలో రెండు కేసులు, ప్రకాశం జిల్లాల్లో మరో రెండు కేసులు.... కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి. విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగేసి కేసులు....ప్రకాశం జిల్లాలో 3, కర్నూలు,చిత్తూరు, తూర్పుగోదావరి,నెల్లూరు జిల్లాల్లో ఒకటి చొప్పున మెుత్తం 19 కేసులు నమోదయ్యాయి. శనివారం 74 అనుమానిత కేసుల్లో నమూనాలను పరీక్షించగా... 68 నెగెటివ్ గా నిర్ధారించారు. మిగతా ఆరూ పాజిటివ్ వచ్చాయి. మరో 65 నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.

కరోనా అలజడి: రాష్ట్రంలో 19కి చేరిన పాజిటివ్ కేసులు

300 మీటర్లు హైసెన్సిటివ్​ జోన్

ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 3కు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చీరాలలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. చీరాల నుంచి 16 మంది ఈ నెల 12న మత పరమైన ప్రార్థనల నిమిత్తం దిల్లీ వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. వారిలో 60 సంవత్సరాల వ్యక్తికి, అతని భార్యకి కరోనా నిర్ధారణ అయినట్లు కలెక్టర్ తెలిపారు. కేసులు నమోదైన ప్రాంతం నుంచి 300 మీటర్లు హైసెన్సిటివ్ జోన్ గా.. 3 కిలో మీట్లర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్లు తెలిపారు.

ఒకరిపై కేసు నమోదు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 43 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్‌ రామ్మూర్తి తెలిపారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. విదేశాల నుంచి వచ్చిన వివరాలను గోప్యంగా ఉంచిన విశాఖ జిల్లా కొప్పాకకు చెందిన వ్యక్తిపై అనకాపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్రాంత వైద్యులు, వైద్యసిబ్బంది సహకారం అందించాలని కలెక్టర్‌ శామ్యూల్ ఆనంద్ కుమార్ కోరారు. త్వరలో గుంటూరు కలెక్టరేట్​లో కరోనా వార్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు.

అవగాహన కోసం సెల్ బ్రాడ్ కాస్ట్ విధానం

ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన 29 వేల 421 మందిని 28 రోజుల గృహ నిర్బంధం లో ఉండాల్సిందిగా సూచించామన్న వైద్య ఆరోగ్య శాఖ... ఎప్పటికపుడు పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపింది. ప్రజల అవగాహన కోసం సెల్ బ్రాడ్ కాస్టు విధానంలో ప్రచారం నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. అలాగే హోమ్ ఐసోలేషన్ క్యూఆర్ కోడ్ విధానం అమలు చేస్తున్నట్టు తెలియచేసింది.

ఇదీ చదవండి:రాష్ట్రానికి వస్తున్న వారికి సరిహద్దుల్లోనే వసతి

ABOUT THE AUTHOR

...view details