ఏపీలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు - ఏపీలో విజృంభిస్తున్న కరోనా
18:35 September 17
ఏపీలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు 6 లక్షలు దాటాయి. కొత్తగా 8,702 పాజిటివ్ కేసులు, 72 మరణాలు నమోదైనట్టు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం బాధితుల సంఖ్య 6,01,462కి చేరింది. కరోనాతో ఏపీలో ఇప్పటి వరకు 5,177 మంది మృతి చెందారు. ప్రస్తుతం 88,197 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 5,08,088 మంది బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీ ప్రభుత్వం 77,492 కరోనా పరీక్షలు నిర్వహించింది.
ఇదీ చదవండి:'గోమూత్రం శానిటైజర్'.. ఇక కరోనాతో బేఫికర్!