తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 592 కరోనా కేసులు.. 3 మరణాలు - తెలంగాణలో కరోనా మరణాలు టుడే

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం తాజాగా 592 మందికి వైరస్ సోకగా.. ముగ్గురు మృతి చెందారు. వైరస్ బారి నుంచి ఇప్పటివరకు 2,73,013 మంది కోలుకున్నారు.

592 new corona cases in telangana and 3 people died
రాష్ట్రంలో కొత్తగా 592 కరోనా కేసులు.. 3 మరణాలు

By

Published : Dec 20, 2020, 10:25 AM IST

రాష్ట్రంలో శనివారం రాత్రి 8గంటల వరకు 41,970 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 592 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,81,414కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,513కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 643 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,73,013కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 6,888 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 4,719 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 64,43,052కి చేరింది.

ఇవీ చూడండి:వణుకుతున్న కశ్మీరం- మంచుగడ్డలా దాల్​ సరస్సు

ABOUT THE AUTHOR

...view details