ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 5,653 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు ఆ రాష్ట్ర వైద్యా రోగ్యశాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,50,517కు చేరింది. ప్రస్తుతం 46,624 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో మరో 5,653 కరోనా కేసులు... 35 మంది మృతి - కరోనా వైరస్ వార్తలు
ఏపీలో కొత్తగా 5,653 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 35 మంది బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 7,50,517కు చేరింది. ప్రస్తుతం 46,624 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ap corona cases
గడిచిన 24 గంటల వ్యవధిలో 6,659 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 6,97,699 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో 35 మంది మృతి చెందారు. మెుత్తం కరోనా మరణాలు 6,194కు చేరాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 73,625 కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. ఇప్పటి వరకూ ఏపీలో చేసిన కొవిడ్ పరీక్షల సంఖ్య 64,94,099కి చేరింది. పాజిటివిటీ రేటు 11.56గా నమోదైంది.
ఇదీ చదవండి:గ్రామ కార్యదర్శికి ఆస్తుల వివరాలు తెలిపిన సీఎం కేసీఆర్