తెలంగాణలో మరో 517 కరోనా కేసులు - తెలంగాణలో కొవిడ్ ప్రభావం

08:52 December 07
రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 102 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 2,73,858కు చేరింది. కొవిడ్ బారినపడి మరో ఇద్దరు మరణించగా.. ఇప్పటివరకు 1,474 మంది మృతిచెందారు.
కరోనా నుంచి తాజాగా మరో 862 మంది కోలుకున్నారు. మొత్తం 2,64,600 మంది బాధితులు కొవిడ్ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,778 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 5,803 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇవీచూడండి:తెలంగాణకు కోటిన్నర కొవిడ్ టీకాలు.. సర్కారు ప్రణాళికలు