ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో... వరుసగా 50వ రోజూ సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారుల బృందం.. వివేకా ఇంటిని మరోసారి పరిశీలించింది. కొత్తగా వచ్చిన సీబీఐ ఉన్నతాధికారి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు.. గంటన్నరకుపైగా ఇంటితోపాటు, పరిసరాలు గమనించారు.
Viveka murder case: 50వ రోజు సీబీఐ విచారణ.. వివేకా ఇంటి పరిశీలన - వివేకానంద రెడ్డి హత్య తాజా వార్తలు
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుసగా 50వ రోజూ సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ అధికారులు.. గంటన్నరకుపైగా వివేకా ఇంటితోపాటు, పరిసరాలు పరిశీలించారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
వివేకా హత్య కేసు
వివేకా ఇంట్లో ఉన్న ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో వారు మాట్లాడారు. హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి... ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, వారి దృష్టికి వచ్చిన విషయాలపై చర్చించారు. అనంతరం సీబీఐ అధికారుల బృందం పులివెందుల పట్టణంలో ఆర్ అండ్ బీ అతిథి గృహానికి వెళ్లింది.
ఇదీ చూడండి:Ramappa Temple : రామప్ప ఆలయానికి క్యూ కట్టిన ప్రముఖులు, పర్యాటకులు