నిరుద్యోగులకు ఇండియన్ ఆర్మీ తీపికబురు అందించింది. ఎంఈఎస్‌లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
1) డ్రాఫ్ట్స్‌మెన్:52
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్స్‌షిప్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనుల్లో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు:18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
2) సూపర్‌వైజర్ (బారక్స్ అండ్ స్టోర్స్):450
అర్హత:ఎకనమిక్స్/ కామర్స్/ స్టాటిస్టిక్స్/ బిజినెస్ స్టడీస్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష 125 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 120 నిమిషాలు ఉంటుంది. కింద సూచించిన విధంగా వివిధ విభాగాల నుంచి ప్రశ్నలు, మార్కులు ఉంటాయి.
- జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
- జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ ఇంగ్లిష్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
- న్యూమరికల్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
- స్పెషలైజ్‌డ్ టాపిక్ - 25 ప్రశ్నలు - 50 మార్కులు
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:సికింద్రాబాద్, వైజాగ్.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.03.2021.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది:12.04.2021.
- పరీక్ష తేదీ:16.05.2021.
ఇదీ చూడండి: త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ: హరీశ్‌రావు