ఆంధ్రప్రదేశ్లో కరోనా కలవర పెడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో విద్యార్థులు ఉండడం గమనార్హం. కర్నూలు జిల్లాలోని ఆదోని కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 50 మంది విద్యార్థినులు, ఇద్దరు సిబ్బందికి వైరస్ నిర్ధరణ అయింది.
కస్తూర్బా పాఠశాలలో.. 50 మంది విద్యార్థినులకు పాజిటివ్ - తెలంగాణ వార్తలు
ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. మరో పాఠశాలలో 50 మంది విద్యార్థినులకు నిర్ధరణ అయింది. వారితో పాటు ఇద్దరు సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారు. వారం రోజుల పాటు పాఠశాలను మూసేశారు.
ఏపీలో కరోనా కేసులు, ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు
ఈ నెల 15న 22 మందికి వైరస్ సోకింది. 257 మంది విద్యార్థినులు చదువుకుంటున్న ఈ పాఠశాలను.. వారం రోజుల పాటు మూసివేశారు.
ఇదీ చదవండి:కరోనా విజృంభణ: ఈ నెలలోనే 11 శాతం కేసులు