తెలంగాణ

telangana

ETV Bharat / city

పురపాలిక ఒక్కటే.. కానీ ఐదుగురు ఛైర్మన్లు..!

మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఒక్కరే ఉంటారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే మారాల్సి వస్తుంది. కానీ ఐదేళ్లలో ఐదుగురు ఛైర్మన్​ పీఠంపై కూర్చోవడమంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే..! ఎన్ని కారణాలుంటే అలా జరుగుతుందో కదా. ఇంతకీ 'అ' మున్సిపాలిటీలో అలా ఎలా జరిగింది?

5-years-5-chairmens-in-amalapuram-muncipality in AP
పురపాలిక ఒక్కటే.. కానీ ఐదుగురు ఛైర్మన్లు..!

By

Published : Mar 4, 2021, 8:34 PM IST

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పురపాలక సంఘం కథ కాస్త వేరు. అయిదేళ్లలో అయిదుగురు ఛైర్మన్లు మారారు. ఇది రికార్డు కాగా.. ఛైర్మన్ పదవీ కాలాన్ని మూడేళ్లు, రెండేళ్ల చొప్పున పంచుకునేలా 2014 ఎన్నికల సమయంలో ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం.. జులై 3, 2014న యాళ్ల మల్లేశ్వరరావు ఛైర్మన్​గా బాధ్యతలు నిర్వహిస్తూ.. ఆకస్మికంగా మరణించారు.

వైస్ ఛైర్మన్​గా ఉన్న పెచ్చెట్టి విజయలక్ష్మి.. 2015-2016 మధ్య ఇం​ఛార్జి ఛైర్ పర్సన్​గా కొనసాగారు. ఆ తర్వాత ఒప్పందంలో భాగంగా 2016-2018 చిక్కాల వినాయకరావు ఛైర్మన్​గా వ్యవహరించారు. ఇంతలో మృతి చెందిన మల్లేశ్వరరావు స్థానం నుంచి ఆయన కుమారుడు నాగ సతీశ్ కౌన్సిలర్​గా విజయం సాధించారు. ఆయన ఛైర్మన్​ పదవికి కావాలనడంతో వినాయకరావు రాజీనామా చేశారు. ఈ క్రమంలో కొద్ది రోజులు గంపల నాగలక్ష్మి ప్యానెల్ ఛైర్​ పర్సన్​గా ఎన్నికయ్యారు. అనంతరం నాగసతీశ్ ఛైర్మన్ పదవిలో కొనసాగారు. ఇదండీ అమలాపురం అయిదుగురు ఛైర్మన్ల వెనక ఉన్న అసలు విషయం. వినడానికి భలే ఆశ్చర్యంగా ఉంది కదూ.!

ఇదీ చదవండి:ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో విశాఖకు 15వ స్థానం

ABOUT THE AUTHOR

...view details