అపార్ట్‌మెంట్ల వాసులకు జలమండలి జలక్ ఇస్తోంది. ఉచిత నీటి పథకం అమలు చేసినట్లే చేసి మోకాలడ్డుతోంది. నల్లాదారుడి గుర్తింపు సంఖ్య(క్యాన్ నంబరు)తో ఆధార్ అనుసంధానమైన ఫ్లాట్లకు కూడా నీటి బిల్లుల మోత తప్పడం లేదు. నగరంలో 24,967 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 3 లక్షల ఫ్లాట్లు ఉన్నట్లు అంచనా. అపార్ట్‌మెంట్లలో ఒక్కో ప్లాటును ఒక ఇంటిగా పరిగణించాలి. అంటే అనుసంధానం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత నీటిని అందించాలి. అయితే అపార్ట్‌మెంట్లను ఒక యూనిట్ కిందకు తీసుకోవడంతో ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో ఏ ఒక్క ప్లాట్ యజమాని అనుసంధానం చేసుకోకపోయినా.. మిగతా వారంతా బిల్లులు భరించాల్సిందే. ఇది సరైన విధానం కాదని నిపుణులు చెబుతున్నారు. ఫ్లాట్లకు ఇలా బిల్లులు బాదేయడం సరికాదంటున్నారు. ఇప్పటికే లింకు చేసుకున్న ఫ్లాట్లకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం బిల్లును అన్ని ఫ్లాట్లకు సమానంగా పంచి.. అందులో నుంచి అనుసంధాన ఫ్లాట్లను మినహాయిస్తే సరిపోతుందని కొందరు సూచిస్తున్నారు.
ఉచితం వర్తించిందా? లేదా?