తెలంగాణ

telangana

ఏపీకి 5 లక్షల డోసుల కొవిడ్ టీకాలు

By

Published : Jan 12, 2021, 12:18 PM IST

ఏపీ రాష్ట్రానికి కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు రాబోతున్నాయి. దిల్లీ నుంచి అందిన సమాచారం ప్రకారం తొలివిడత కింద సుమారు 5 లక్షల డోసులు రానున్నాయి. ఇందులో సుమారు 4 లక్షల డోసులు పుణెలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకాలు ఉన్నట్లు సమాచారం.

5-lakhs-covid-19-vaccine-doses-for-andhrapradesh
ఏపీకి 5 లక్షల డోసుల కొవిడ్ టీకాలు

ఏపీ రాష్ట్రానికి కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు రానున్నాయి. ఆయా టీకా డోసులను సంబంధిత జిల్లాలకు పంపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తొలివిడత కింద 3,82,899 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేస్తారు. వీరి వివరాలను కొవిన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. మొత్తం 1,940 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అర్హులందరికీ టీకా వేయాలంటే 40,410 కేంద్రాలు అవసరం అవుతాయని అంచనా. 17,775 మందికి వ్యాక్సినేటర్లను సిద్ధం చేశారు.

కనిష్ఠ స్థాయికి కరోనా కేసులు

ఏపీలో కనిష్ఠ స్థాయిలో.. 121 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 30,933 నమూనాలు పరీక్షించారు. 121 (0.39%) మందికి పాజిటివ్‌గా తేలింది. విజయనగరం జిల్లాలో ఒక్క కేసూ రాలేదు. కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ABOUT THE AUTHOR

...view details