ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది(amaravathi farmers maha padayatra on 4th day). 'న్యాయస్థానం నుంచి దేవస్థానం'పేరుతో చేపట్టిన ఈ యాత్ర(4th day of Amaravati farmers maha padayatra) ఈరోజు గుంటూరు జిల్లా పుల్లడిగుంట నుంచి ప్రత్తిపాడు వరకు సాగనుంది. నేడు సుమారు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు.. బుధవారం గుంటూరు నగరవాసుల నుంచి అపూర్వ మద్దతు లభించిన విషయం తెలిసిందే.
Amaravati Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్రకు అపూర్వ స్పందన - మహాపాదయాత్ర తాజా వార్తలు
ఏపీలో రాజధాని రైతులు, మహిళలు మహా సంకల్పంతో చేపట్టిన పాదయాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. నాలుగో రోజు ఈ యాత్ర గుంటూరు జిల్లా పుల్లడి గుంట నుంచి ప్రత్తిపాడు వరకు కొనసాగనుంది.
Amaravati Padayatra
అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజులపాటు కొనసాగనుంది. అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా మహాపాదయాత్ర(maha padayatra for capital city amaravathi) ముందుకు సాగుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది.
ఇదీ చదవండి:DIWALI: దీపావళి వేళ అందరిళ్లలో వెలుగులు.. వారిళ్లలో మాత్రం చీకట్లు!