తెలంగాణ

telangana

ETV Bharat / city

'స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి' - మంత్రి శ్రీనివాస్​గౌడ్​ను కలిసిన నాలుగో తరగతి ఉద్యోగులు

తెలంగాణ రాష్ట్ర నాలుగో తరగతి ఉద్యోగులు మంత్రి శ్రీనివాస్​గౌడ్​ను కలిశారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తమను రాష్ట్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగులు తెలిపారు.

'స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి'
'స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి'

By

Published : Jun 16, 2020, 4:24 PM IST

ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాలుగో తరగతి ఉద్యోగులు కోరారు. రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను కలిసిన ఉద్యోగులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ముందుండి పోరాడింది తామేనని... రాష్ట్రం ఏర్పడితే స్వరాష్ట్రంలో పని చెయ్యవచ్చనే తమ ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

'స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి'

ఆరేళ్లుగా హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రయాణిస్తూ... స్వరాష్ట్రానికి తిరిగి వస్తామనే ఆశతో ఉన్నామన్నారు. అయితే లాక్​డౌన్ వల్ల అక్కడికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏపీలో పనిచేస్తున్న నాలుగు వందల మంది తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వేడుకున్నారు. త్వరలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.

ఇవీ చూడండి:ప్రత్యేక హెలికాప్టర్​లో గొరిల్లా.. కారణమేంటంటే?

ABOUT THE AUTHOR

...view details