సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 8 నుంచి 14 వరకు టీఎస్ఆర్టీసీ... ప్రత్యేక బస్సులు నడుపనుందని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ బి వరప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 4980 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్ఎం స్పష్టం చేశారు.
మహాత్మా గాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్స్టేషస్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, టెలిఫోన్‌భవన్, దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి, అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని వరప్రసాద్ వివరించారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళము, భీమవరం, నర్సాపురం, కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు కూడా సంక్రాంతి ప్రత్యేక బస్సులు నగరంలోని వివిధ పాయింట్ల నుంచి సిద్ధంగా ఉంటాయన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 3,380 బస్సులు, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు సుమారు 1,600 బస్సులు నడిపించనున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సుల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ ( www.tsrtconline.in) సౌకర్యంతో ఏర్పాటు చేశామని వరప్రసాద్ వివరించారు.