రాష్ట్రంలో తక్కువ పరీక్షలు నిర్వహిస్తుడంటంతో కేసులు సంఖ్య సైతం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో కొత్త కేసుల కంటే.. వైరస్‌ను జయించిన వారి సంఖ్య సంఖ్య అధికంగా ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 5 వేలకు దిగువకు కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఈ సాయంత్రం వరకు 55,358 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 4 వేల 976 మందికి వైరస్ నిర్ధరణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 35 మంది మహమ్మారికి చనిపోవడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య...... 2,739కి చేరిందని వివరించింది.
రాష్ట్రంలో మరో 4,976 కరోనా కేసులు.. 35 మరణాలు - covid cases in telangana
18:01 May 09
రాష్ట్రంలో మరో 4,976 కరోనా కేసులు.. 35 మరణాలు
వైరస్ నుంచి మరో 7,646 కోలుకున్నారని తెలిపిన వైద్యారోగ్య శాఖ.. వారితో కలుపుకుంటే 4,28,865కి చేరినట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో.. 65,757 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 851, రంగారెడ్డి జిల్లాలో 417, మేడ్చల్ జిల్లాలో 384 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 13 జిల్లాల్లో 100కు మించి కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
సిద్దిపేట – 304, కరీంనగర్ - 271, సూర్యాపేట- 217, వరంగల్ అర్బన్ 218, మహబూబ్‌నగర్- 208 మందికి వైరస్ సోకింది. సంగారెడ్డి- 178 వికారాబాద్- 150, ఖమ్మం 138, మహబూబాబాద్- 126, నాగర్ కర్నూలు- 124, మంచిర్యాల -115, నల్గొండ -110, వనపర్తి- 106 మందికి కరోనా వచ్చినట్లు వరించింది. ఇదే సమయంలో దేశంలో కోవిడ్ బాధితుల రికవరీ రేటు 82.1 శాతం ఉండగా.. రాష్ట్రంలో 86.22 శాతంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇవీ చూడండి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్