తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో మరో 48 పాజిటివ్​ కేసులు.. ఒకరు మృతి - ap corona cases news

ఏపీలో గడిచిన 24 గంటల్లో 48 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. తాజాగా నమోదైన కేసుల్లో నాలుగు కోయంబేడు కాంటాక్ట్‌ కేసులు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

carona_update
ఏపీలో మరో 48 పాజిటివ్​ కేసులు

By

Published : May 26, 2020, 11:41 AM IST

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్​ సోకిన వారి సంఖ్య 2719కు చేరాయి. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లా ఒకరు మృతి చెందారు. 55 మంది ఆస్పుత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 759 మంది చికిత్స పొందుతున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నమోదైన 48 కేసుల్లో నాలుగు కోయంబేడు కాంటాక్ట్‌ కేసులు ఉన్నట్లు హెల్త్ బులెటిన్​ పేర్కొంది.

హెల్త్ బులెటిన్​

ABOUT THE AUTHOR

...view details