AP Corona Cases Today: ఏపీలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30,578 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 4,605 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి.. 10 మంది మృతి చెందారు. కొవిడ్ నుంచి కొత్తగా 11,729 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 93,488 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించిది.
జిల్లాల వారిగా కేసులు
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 642 కేసులు నమోదు కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో 539, గుంటూరు జిల్లాలో 524, నెల్లూరు జిల్లాలో 501 కరోనా కేసులు నమోదయ్యాయి.
Covid cases in India: భారత్‌లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,72,433 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,008 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,59,107 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం మరణాలు: 4,98,983
- యాక్టివ్ కేసులు:15,33,921
దేశంలో ఇప్పటి వరకు మొత్తం 167.87కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
World Corona cases :ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 30,17,855 మందికి కరోనా సోకింది. 11,921 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 385,204,312కి చేరగా.. మరణాల సంఖ్య 57,18,791కి పెరిగింది.
- ఫ్రాన్స్‌లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 3,1,5,363 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 276 మంది చనిపోయారు.
- US Corona Cases: అమెరికాలో కొత్తగా 302,177 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 2,990 మంది మరణించారు.
- ఇటలీలో 1,18,994 లక్షల కొత్త కేసులు బయటపడగా.. 395 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 1,88,552 మందికి వైరస్ సోకగా.. 946 మంది చనిపోయారు.
- జర్మనీలో ఒక్కరోజే దాదాపు 2,23,322 మందికి వైరస్ సోకింది. మరో 174 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి