ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్ల ఉదయం 10 వరకు కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 392 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 44 మంది ఉన్నారు. ఇతర దేశాలకు చెందినవారు ఏడుగురు ఉన్నారు.
ఏపీలో తాజాగా 443 కేసులు నమోదు..9వేలు దాటిన బాధితులు.. - ఏపీ కరోనా తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉదయం 10 వరకు కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,372గా ఉండగా... అందులో రాష్ట్రానికి చెందిన కేసులు 7,451 ఉన్నాయి.
ఏపీలో మరో 443 కరోనా పాటిజివ్ కేసులు
ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 9,372గా ఉండగా... అందులో రాష్ట్రానికి చెందిన కేసులు 7,451. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి 1,584కాగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు 337 మంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,826 మంది చికిత్స పొందుతుండగా.. 4,435 మంది నయమై డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు 111 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో 16,704 కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి:ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు: కర్నల్ భార్య సంతోషి