రాష్ట్రంలో కొత్తగా 427 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 87,509 కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 6,51,715కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. వైరస్‌తో తాజాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,838కి చేరింది.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 427 కరోనా కేసులు.. ఇద్దరు మృతి - తెలంగాణలో కరోనా కేసులు
రాష్ట్రంలో 24 గంటల్లో 87,509 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 427 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వైరస్‌తో తాజాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కేసులు
ఒక్కరోజు వ్యవధిలో 609 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,40,065కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,812 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.