ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో 4.6 కిలోల బరువుతో ఓ బాబు జన్మించాడు. రామకుప్పం మండలం సింగ సముద్రం గ్రామానికి చెందిన గంగమ్మ ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. ఆమెకు రెండో కాన్పులో 4.6 కిలోల బరువున్న మగబిడ్డ పుట్టాడు. చాలా అరుదైన సందర్భాలలో పిల్లలు అధిక బరువుతో జన్మిస్తారని వైద్యులు తెలిపారు.
కుప్పం ప్రభుత్వాస్పత్రిలో 4.6 కిలోల శిశువు జననం - babies news
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ 4.6 కిలోల పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. చాలా అరుదుగా... పిల్లలు అధిక బరువుతో పుడతారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ హరిత చెప్పారు.
child born with high weight
సాధారణంగా శిశువులు 2 - 3.5 కిలోల బరువుతో పుడతారు. జన్యుపరమైన కారణాలు, నెలలు నిండాక ఎక్కువ రోజులు గడవటం.. పిల్లలు అధిక బరువుతో పుట్టడానికి కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మగబిడ్డ పది నెలల 20 రోజులకు తల్లి గర్భం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యురాలు హరిత చెప్పారు.
ఇదీచూడండి:BONALU: ఈసారి ఘనంగా బోనాల జాతర.. రూ.15 కోట్లు కేటాయింపు!