ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం రాష్ట్రంలో మూడో దఫా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మూడోదశకు ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్ - ఏపీ వార్తలు
ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మూడోదశకు ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 579 పంచాయతీలు, 11732 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,221 పంచాయతీలు, 19,607 వార్డులకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. పోలింగ్ రోజునే ఫలితాలు వెల్లడిస్తారు.