తెలంగాణ

telangana

ETV Bharat / city

engineering counselling third phase: నేటి నుంచే ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ - COUNSELING 3rd Phase starts from tomorrow

engineering counselling third phase: ఏపీలో నేటి నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని ఆ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి వెల్లడించారు. ఉన్నత విద్యను అభివృద్ధి చేసేందుకు.. ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను ఆయన వివరించారు.

engineering counselling third phase
ఏపీలో గురువారం నుంచి మూడో విడత కౌన్సెలింగ్

By

Published : Jan 5, 2022, 9:46 PM IST

Updated : Jan 6, 2022, 3:14 AM IST

engineering counselling third phase: ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సులకు ఏపీలో నేటి నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. 2020-2021 ఉన్నత విద్యా మండలి వార్షిక నివేదికను ఆయన విజయవాడలో విడుదల చేశారు. ఈ నెలాఖరుకు మొత్తం అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.

క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ఏర్పాటు

quality assurance cell: ఇందుకోసం.. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ద్వారా నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జాతీయ విద్యా సంస్థలతో కలిసి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను.. 5 క్లస్టర్లుగా విభజించి ఉన్నత విద్య అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

campus selections: గతేడాది 70 వేల మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు పొందినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,700 కాలేజీలు వచ్చే మూడేళ్లలో న్యాక్​ (NAC) అక్రిడేషన్ తీసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు ఏడాది పొడవునా తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు.

Last Updated : Jan 6, 2022, 3:14 AM IST

ABOUT THE AUTHOR

...view details