తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : May 27, 2022, 2:58 PM IST

Updated : May 27, 2022, 3:06 PM IST

  • మరో పరువు హత్య.. కుమార్తెను చంపిన తల్లిదండ్రులు!

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం నాగల్‌కొండలో పరువు హత్య ఘటన వెలుగుచూసింది. వేరే మతానికి చెందిన యువకుడిని తమ కుమార్తె ప్రేమిస్తోందని.. తల్లిదండ్రులే దారుణంగా హత్యచేశారు.

  • అలా మాట్లాడే హక్కు మీకు లేదు..

నిన్న హైదరాబాద్ పర్యటనలో మోదీ వ్యాఖ్యలపై తెరాస తీవ్రంగా మండిపడుతోంది. కుటుంబ పార్టీ అంటూ.. తెరాసను ఉద్దేశించి మాట్లాడిన మోదీ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. భాజపాలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు చాలా మంది ఉన్నారని వివరించారు.

  • 'మా పిల్లల్ని ఎన్‌కౌంటర్ చేస్తారట..!'

హైదరాబాద్ బేగంబజార్ పరువు హత్య కేసులో నీరజ్‌ను హతమార్చిన నిందితులకు రక్షణ కల్పించాలని వారి తల్లిదండ్రులు, బంధువులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

  • 'సోలార్ గోల్డ్ కోట్‌' యాప్‌తో గోల్‌మాల్‌

ఒకవంతు పెట్టుబడిగా పెడితే... రెండింతల డబ్బు.. ఖాతాలో వేస్తామని నమ్మించారు. కొంతమంది ఖాతాల్లో డబ్బులు వేసి నమ్మించారు. సభ్యుల్ని చేర్పిస్తే కమీషన్ చెల్లిస్తామనడంతో ఎంతోమందిని చేర్పించారు. కొందరు వేలల్లో, లక్షల్లో ఒకేసారి డబ్బులు చెల్లించారు. అంతే.. ఇన్నేళ్లు లావాదేవీల్ని నడిపిన యాప్..... ఒక్కసారిగా మాయమైంది.

  • మాట్లాడితే మోసపోవడమే! సైబర్​ కేటుగాళ్లతో జాగ్రత్త గురూ!!

తలుపులు బద్దలు కొట్టాల్సిన పనిలేదు.. గోడలకు కన్నమేయాల్సిన అవసరం లేదు.. కాలు బయటపెట్టకుండానే కావాల్సినంత దోచుకునే వెసులుబాటు.. కాస్త కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండటమే అర్హత.. నాలుగు ముక్కలు మాట్లాడి బురిడీ కొట్టించగలిగితే అదే ఆయుధం.. అందుకే సైబర్‌ నేరస్థులు చెలరేగిపోతున్నారు.

  • 'టెక్నాలజీకి గత పాలకులు దూరం- పేదలకు నష్టం'

2014కు ముందు పరిపాలనలో సాంకేతికతను ఉపయోగించకపోవడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోయారని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. డ్రోన్ల సాంకేతికతతో కొత్త శకం మొదలైందని అన్నారు.

  • డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్​కు క్లీన్​చిట్

షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్​కు డ్రగ్స్ కేసులో క్లీన్​ చిట్ ఇచ్చింది ఎన్​సీబీ. ఆర్యన్​కు డ్రగ్స్​తో సంబంధం ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రంలో పేర్కొంది.

అక్రమాస్తుల కేసులో మాజీ సీఎంకు షాక్

అక్రమాస్తుల కేసులో హరియణా మాజీ ముఖ్యమంత్రి ఓపీ చౌతాలాకు శిక్ష ఖరారు చేసింది దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. నాలుగేళ్లు జైలుశిక్ష, రూ.50లక్షలు జరిమానా విధించింది. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది.

  • లీటర్ పెట్రోల్ ధర రూ.30 పెంపు- మోదీపై మాజీ ప్రధాని ప్రశంసలు

ఆర్థికంగా సతమవుతున్న పాకిస్థాన్​లో ఇంధన ధరలను పెంచి ప్రజలపై మరింత భారం వేసింది అక్కడి ప్రభుత్వం. అన్ని రకాల పెట్రోల్​ ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ చర్యపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్​ తీవ్ర విమర్శలు చేశారు. భారత్​ ధరలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది అంటూ ప్రశంసించారు.

  • రివ్యూ: 'ఎఫ్‌3' మూవీ ఎలా ఉందంటే?

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం 'ఎఫ్​3'. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది? నటీనటులు ఎలా చేశారో చూద్దాం.

Last Updated : May 27, 2022, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details