ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలునిండుకుండలా శ్రీశైలం.. గేట్లు ఎత్తి నీటి విడుదల కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.ప్రాజెక్టులకు మళ్లీ పోటెత్తుతోన్న వరదలు..గత మూడు, నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ తీసుకున్న వాన దేవుడు.. మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కుండపోత వర్షాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. భారీ వర్షాలతో రహదారులన్నీ చెరువులను తలపిస్తుండగా.. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది.భయం గుప్పిట్లో భాగ్యనగరం.. భారీ వర్షాలు, ఉప్పొంగుతున్న వరదలతో హైదరాబాద్‌లోని పలుకాలనీలు మరోసారి భయం గుప్పిట్లో గడుపుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.... పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది.జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద..ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతోపాటు, స్థానికంగా వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్‌లోని జంటజలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ 4 గేట్లు ఎత్తి 1248 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 330 క్యూసెక్కులను మూసీలోకి విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజులు కుంభవృష్టి.. రాష్ట్రంలో వానలు మళ్లీ దంచికొడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షానికి జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు, చెరువులు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో రవాణా వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. స్వగ్రామానికి ఆ విద్యార్థిని మృతదేహం..తమిళనాడులో 12వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందిన బాలిక మృత దేహాన్ని అధికారులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. పోస్టుమార్టం అనంతరం విద్యార్థిని మృతదేహన్ని కడలూరు జిల్లాలోని బాలిక స్వగ్రామానికి అంబులెన్స్‌లో తరలించారు. మృతదేహన్ని చూసి బాలిక తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.స్కూటీని డ్రైవర్‌తో సహా అంతెత్తున గాల్లోకి లేపిన క్రేన్.. కారణం తెలిస్తే..! వాహనదారుడు స్కూటీపై ఉండగానే క్రేన్ సాయంతో వాహనాన్ని గాల్లోకి లేపారు ట్రాఫిక్ పోలీసులు. నో పార్కింగ్ జోన్లో స్కూటీ పార్క్ చేయడమే అందుకు కారణం. మొదట ట్రాఫిక్ పోలీసులు క్రేన్‌తో ఆ వాహనాన్ని ఎత్తుకెళ్లేందుకు వచ్చారు. కానీ ఆ సమయంలో యజమాని అడ్డు తగిలి స్కూటీపైనే కూర్చున్నాడు.ఫేక్బుక్లో కొత్త ఫీచర్లు.. ఇకపై ఫ్రెండ్స్ పోస్ట్‌లు మిస్ అవకుండా ఉండేలా..ముఖ్యమైన పోస్టులు మిస్ అవకుండా ఉండేందుకు ఫేస్బుక్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. హోమ్, ఫీడ్ అనే రెండు ఫీచర్లతో యూజర్లు తమకు నచ్చిన కంటెంట్‌ను ముందుగా చూడొచ్చు. 'టీ20 ప్రభావం.. మరణం అంచున వన్డే క్రికెట్' వన్డే క్రికెట్ మనుగడపై ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 లీగ్‌లు పెరుగుతుండటం.. వన్డేల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు వెల్లడించారు.క్రికెట్ ఆడుతూ ప్రముఖ నటుడు కన్నుమూతసినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు, కమెడియన్ దీపేశ్ భాన్ కన్నుమూశారు. దీపేశ్ భాన్ మృతి చెందిన విషయాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ కవితా కౌశిక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.