తెలంగాణ

telangana

ETV Bharat / city

3PM TOPNEWS: టాప్​ న్యూస్ @3PM - 3PM TOPNEWS

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Jul 22, 2022, 2:58 PM IST

  • రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్..

రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. విపక్షాలకు చెందిన దాదాపు 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు ఓటు వేసినట్లు తెలుస్తోంది.

  • ప్రియురాలి తల నరికి.. స్టేషన్​కు తీసుకెళ్లిన యువకుడు..

ప్రియురాలిని దారుణంగా నరికి.. తలతో పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు ఓ యువకుడు. ఈ ఘటన కర్ణాటక విజయనగర జిల్లాలో జరిగింది. మరో ఘటనలో పోలీస్ కస్టడీ అనంతరం.. ఓ వ్యక్తి చనిపోవడం కేరళ కోజికోడ్​లో కలకలం రేపింది.

  • మోదీజీ థ్యాంక్స్.. ఈడీ చీఫ్​గా బండిని నియమించినందుకు..: కేటీఆర్

కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. 'దేశంలో డబుల్ ఇంజిన్ అంటే మోడీ, ఈడీ'అని అర్థమైందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈడీ చీఫ్​గా బండిని నియమించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ ట్వీటారు.

  • సూర్యాపేటలో విస్తారంగా వర్షాలు.. ఇళ్లలోకి చేరుతున్న వర్షపునీరు.

షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జోరువానకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు..

కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు.. సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దాఖలైన ఆరు పిటిషన్లు కలిపి ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ జులై 27కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

  • ఎద్దు వీరంగం.. పది మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్​ తుని పట్టణంలో ఓ ఎద్దు వీరంగం సృష్టించింది. పురవీధుల్లో పరుగెడుతూ జనంపై విరుచుకుపడింది. ఎద్దును బంధించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నారు.

  • అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు..

కాలేజీ విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని ఫొటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అదెక్కడో? ఎందుకో తెలుసుకుందాం.

  • ఆగస్టు 7 నుంచి 'ఆకాశ ఎయిర్‌' రయ్​రయ్​

విమాన సేవలు అందించేందుకు కొత్త సంస్థ సిద్ధమైంది. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మద్దతు ఉన్న 'ఆకాశ ఎయిర్‌' ఆగస్టు 7న తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తమ సంస్థ తొలి సర్వీసును ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య నడపనున్నట్లు తెలిపింది.

  • బ్యాంకులకు వచ్చే జనంపై యుద్ధ ట్యాంకులతో గురి! చైనాలో అంతే!!

స్వదేశీ పౌరులపైనే చైనా యుద్ధ ట్యాంకులు బ్యారెల్స్‌ను ఎక్కుపెట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజల సొమ్మును డిపాజిట్లుగా తీసుకొని అవకతవకలకు పాల్పడి ఎగ్గొట్టిన బ్యాంకులకు రక్షణగా ఇలా ప్రభుత్వం చేస్తోందని అంటున్నారు. అటువంటిదేమీ లేదని చైనా విశ్లేషకులు అంటున్నారు.

  • అతడు తొలి వన్డేకు డౌటే.. ఆందోళనలో ఫ్యాన్స్​!

వెస్టిండీస్​తో జరగబోయే తొలి వన్డేకు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తన్నాయి. అతడికి గాయమైనట్లు తెలిసింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details