తెలంగాణ

telangana

ETV Bharat / city

3PM TOPNEWS: టాప్​ న్యూస్ @3PM - 3PM టాప్​ న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Jul 21, 2022, 2:58 PM IST

  • సోనియా ఈడీ విచారణపై కాంగ్రెస్ తీవ్ర నిరసనలు..

నేషనల్​ హెరాల్డ్​ కేసులో సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్​ తీవ్రంగా మండిపడుతోంది. రాజకీయ ప్రతీకారంలో భాగంగానే కేంద్రం.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు.

  • ఈడీ విచారణకు బ్రేక్.. స్పెషల్​ రిక్వెస్ట్​తో ఇంటికి సోనియా

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని 2 గంటలు ప్రశ్నించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్. ఆరోగ్య కారణాలతో(ఇటీవల కరోనా నుంచి కోలుకోవడం) ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని.. సోనియా ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు.

  • 'విచారణ పేరిట సోనియాను వేధిస్తున్నారు'

సోనియాపై ఈడీ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో... హైదరాబాద్‌లోనూ హస్తం నేతలు ధర్నాకు దిగారు. నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయల్దేరారు.

  • కుక్క కరిచిందని కోతికి వైద్యం.. భుజంలో బుల్లెట్ చూసి డాక్టర్లు షాక్

కుక్కల దాడిలో గాయపడిన ఓ కోతికి వైద్యం చేస్తున్న సమయంలో.. వానరం భుజంలో తూటా కనిపించటంతో వైద్యులు అవాక్కయ్యారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడలో ఒక కోతి పై కుక్కలు దాడి చేయగా.. పశువైద్యశాలకి తరలించారు. చికిత్స చేస్తున్న సమయంలో డాక్టర్లు కోతి భుజంలో తూటాను గుర్తించారు.

  • ట్రాన్స్ జెండర్​పై 15మంది అత్యాచారం

కామంతో రెచ్చిపోతున్న కొందరు మగాళ్లకు ఆడది కనబడితే చాలు వాళ్లల్లో ఉన్న మృగం బయటికి వస్తుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి ట్రాన్స్​జెండర్లను కూడా వదలడం లేదు. తాజాగా 15 మంది కలిసి ఓ ట్రాన్స్​జెండర్​పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ముళ్ల కంపలో పడేసిన దారుణ ఘటన ఏపీలోని పులివెందులలో చోటుచేసుకుంది.

  • విద్యార్థిని చితకబాదిన వ్యాయామ ఉపాధ్యాయుడు.. కారణం తెలిస్తే.!

చెప్పకుండా ఇంటికి వెళ్లడమే ఆ విద్యార్థి చేసిన నేరం.. అందుకు ఆ కర్కశ వ్యాయామ ఉపాధ్యాయుడు బాలుడిని కొట్టడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించాడు. మహబూబాబాద్ జిల్లా దామరవంచలో ఓ గురుకుల పాఠశాలలో ఆలస్యంగా చోటుచేసుకున్న ఈ ఘటన దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

  • పెళ్లి పేరుతో గాలం.. నగలు, డబ్బు దోచేసి మాయం

పెళ్లి పేరుతో మహిళలకు గాలం వేస్తాడు. వివాహం చేసుకునే ముందే వారితో కలిసి తిరుగుతాడు. మాయ మాటలు చెబుతూ.. తనకు అత్యవసరం అని చెప్పి వారి నగలు, డబ్బు తీసుకుంటాడు. అంతే.. ఇక చెప్పా పెట్టకుండా అక్కణ్నుంచి ఉడాయిస్తాడు. ఇలా మరో మహిళకు వల పన్నుతాడు. ఆమె పేరిట బ్యాంకు ఖాతా తెరిచి ఈ ఆభరణాలు బ్యాంకులో పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటాడు.

  • 'స్కాం యాప్స్​'తో డబ్బులు కాజేస్తూ.. రెచ్చిపోతున్న సైబర్​ కేటుగాళ్లు

డేటా భద్రత విషయంలో యాపిల్ అత్యంత జాగ్రత్తగా ఉంటుంది. యూజర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ థర్డ్ పార్టీ యాప్​లు ఇన్​స్టాల్ చేసుకునేందుకు అనుమతించదు. అలాంటి యాపిల్ యాప్ స్టోర్​లో కొన్ని స్కామ్ యాప్​ల ద్వారా సైబర్​ నేరగాళ్లు భారీ నగదును దోచుకున్నట్లు తెలుస్తోంది.

  • 'వన్డే క్రికెట్​ అంతరించేలా ఉంది.. వాటిని తగ్గిస్తేనే మంచిది'

ఇకపై అంతర్జాతీయ షెడ్యూల్​లో వన్డేలకు ప్రాధాన్యం తగ్గిస్తే మంచిదని సూచించాడు దిగ్గజ బౌలర్​, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ వసీం అక్రమ్. ఇంగ్లాండ్​ ఆటగాడు బెన్​స్టోక్స్​ వన్డేల నుంచి తప్పుకోవడంపై స్పందిస్తూ.. అతడి నిర్ణయానికి మద్దతుగా నిలుస్తానని పేర్కొన్నాడు. వన్డే​ క్రికెట్​ అంతరించే స్థాయికి చేరుకుందని తెలిపాడు.

  • బ్రెయిన్​ క్యాన్సర్​తో ​నటి మృతి.. సినీ ప్రముఖుల సంతాపం

ప్రముఖ ఒడియా నటి, యాంకర్​ రాజేశ్వరి మోహపాత్ర మృతిచెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్​తో పోరాడుతున్న ఆమె గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్వరి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details