తెలంగాణ

telangana

ETV Bharat / city

3PM TOPNEWS: టాప్​ న్యూస్ @3PM - 3PM టాప్​ న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Jul 20, 2022, 2:59 PM IST

  • సవాళ్ల లంకకు సారథిగా రణిల్.. ద్వీపదేశం గట్టెక్కేనా?

తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రణిల్ విక్రమసింఘె(73). బుధవారం పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు రణిల్​కే మద్దతు పలికారు. మొత్తం 225 మంది సభ్యుల్లో 134 మంది ఆయనకు ఓటేశారు.

  • కామన్​వెల్త్​ అథ్లెట్లకు మోదీ దిశానిర్దేశం

కామన్​వెల్త్​ గేమ్స్​-2022లో పాల్గొనే భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు క్రీడాకారులకు సక్సెస్​ మంత్రను బోధించారు మోదీ. కొందరు క్రీడాకారుల అనుభవాలను మోదీ తెలుసుకున్నారు.

  • కల్తీ సారా తాగి 9 మంది మృతి..

కల్తీ సారా తొమ్మిది మందిని కబళించింది. అక్రమంగా నిర్వహిస్తున్న లిక్కర్ షాపులో మద్యం సేవించి వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు.

  • రామయ్య సన్నిధిలో పాడైపోయిన సుమారు 5వేల లడ్డూలు

గోదావరి వరదలతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. భక్తుల రాక తగ్గడంతో రామయ్య సన్నిధిలో సుమారు 5వేల లడ్డూలు పాడైపోయాయి. పాడైన లడ్డూలను తిరిగి వినియోగించాలని సిబ్బందిని ఏఈవో ఆదేశించారు.

  • 'ఏ ప్రభుత్వానికైనా.. ఉపాధి కల్పనే అతిపెద్ద సవాల్'

నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే అందరికి ఉపాధి కల్పన సాధ్యమవుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • 'మాటలు మాని.. వరద బాధితులను ఆదుకోండి'

గోదావరి వరదలతో జనం అల్లాడుతుంటే వారి గురించి పట్టించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇతరులపై నెపం నెట్టి తప్పించుకునే యత్నం చేస్తోందని భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. మాటలు చెప్పడం మాని వరద బాధితులను ఆదుకోవాలని సర్కార్‌ను డిమాండ్ చేశారు.

  • కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తిని.. చెట్టుకు ఉరేసి తగులబెట్టారు..

భూ వివాదం గురించి ఇవాళ కోర్టుకు వెళ్లాల్సిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు ఓ చెట్టుకు ఉరివేశారు. అంతటితో ఆగకుండా నిప్పంటించి తగులబెట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రామచంద్రపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • 300కిలోల హెరాయిన్ కేసులో ఎన్​ఐఏ భారీ సెర్చ్ ఆపరేషన్!

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) తమిళనాడులోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఎన్​ఐఏ బుధవారం ఈ సోదాలు నిర్వహించింది. మరోవైపు జమ్ము శ్రీనగర్​లో లభ్యమైన తుపాకుల కేసులోనూ సోదాలు నిర్వహించింది.

  • బీమా పాలసీ కోసం పిలిచి మహిళపై రేప్..

రూ.30 లక్షల పాలసీ కొంటామని ఓ హోటల్​కు పిలిచి బీమా కంపెనీ ఉద్యోగినిపై అత్యాచారం చేశారు ఇద్దరు వ్యక్తులు. గురుగ్రామ్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు, మతిస్థిమితం లేని బాలికను ఓ వ్యక్తి రేప్ చేశాడు.

  • 'సామ్‌-చైది చూడముచ్చటైన జంట.. ఎప్పుడూ గొడవపడలేదు'

సమంత-నాగచైతన్య పెళ్లయ్యాక ఎలా ఉండేవారో చెప్పారు సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ స్పందించారు. పెళ్లయాక వాళ్లు తమ అపార్ట్‌మెంట్స్‌లోనే ఉండేవారని, వాళ్లది చూడ ముచ్చటైన జంట అని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details