తెలంగాణ

telangana

ETV Bharat / city

3PM TOPNEWS: టాప్​ న్యూస్ @3PM - 3PM టాప్​ న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Jul 19, 2022, 2:59 PM IST

  • అలర్ట్.. ఈనెల 30, 31న ఎంసెట్ అగ్రికల్చర్

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.

  • 'పోలవరం వల్లే భద్రాచలానికి ముంపు'

పోలవరం వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టు వల్లే ఇప్పుడు భద్రాచలంలో వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోందని చెప్పారు.

  • హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయాలని అడగగలమా..: బొత్స

విలీన మండలాలను తెలంగాణలో కలపాలన్న మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పోలవరం నిర్మాణం విభజన చట్ట ప్రకారమే జరుగుతోందన్న మంత్రి బొత్స... హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయాలని అడగగలమా అని ప్రశ్నించారు.

  • మాజీ సీజే డీపీతో రూ.2 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

దిల్లీ హైకోర్టు సీజే.. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ఫొటోతో వాట్సాప్ ఖాతా సృష్టించి తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న అధికారి వద్ద డబ్బు కాజేశారు సైబర్ కేటుగాళ్లు.

  • ఉభయ సభలు రేపటికి వాయిదా

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల రెండో రోజు కూడా ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ధరల పెంపుపై విపక్షాల ఆందోళనతో.. లోక్​సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి.

  • 'అగ్నిపథ్​పై​ పిటిషన్లన్నీ దిల్లీ హైకోర్టుకే.. అప్పటి వరకు ఆగండి!'

అగ్నిపథ్​ పథకాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. మిగతా రాష్ట్రాల్లో పెండింగ్​లో ఉన్న ఈ తరహా కేసులను కూడా కావాలనుకుంటే అక్కడికే బదిలీ చేయొచ్చని స్పష్టం చేసింది.

  • వరదలో కొట్టుకుపోయిన స్కూల్​ బస్.. లైవ్ వీడియో!

ఉత్తరాఖండ్​ చంపావత్ జిల్లాలో ఓ స్కూలు బస్సు వరదలో కొట్టుకుపోయింది. టనక్​పుర్​ సమీపంలోని పూర్ణగిరి రోడ్​లో ఈ ఘటన జరిగింది. వంతన పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి మధ్యలో నుంచే వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే.. బస్సు అదుపు తప్పి, కాల్వలోకి పడిపోయింది.

  • మైనింగ్ మాఫియాకు డీఎస్​పీ బలి.. లారీతో ఢీకొట్టి...

హరియాణాలో దారుణం జరిగింది. నుహ్​లో అక్రమ మైనింగ్ జరుగుతోందని విచారణకు వెళ్లిన మేవాత్ డీఎస్​పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్​ని లారీతో ఢీకొట్టి హత్యచేశారు. నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

  • హార్దిక్‌ పాండ్య.. టీ20 ప్రపంచ కప్​లో టీమ్​ఇండియా ఆశాకిరణం

2022 ఐపీఎల్‌లో అందరూ ఆశ్చర్యపోయి తనవైపు చూసేలా చేశాడు హార్దిక్‌. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా మెరుపులు మెరిపించడమే కాక.. కెప్టెన్‌గానూ సత్తా చాటాడు. ఆ మెరుపులు తాత్కాలికం కాదని రుజువు చేస్తూ అంతర్జాతీయ క్రికెట్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. రాబోయే టీ20 ప్రపంచ కప్​లో టీమ్​ ఇండియా జట్టుకు ఆశా కిరణంగా కనిపిస్తున్నాడు.

  • ఒకే సినిమాలో రజినీ-కమల్​..

సూపర్​స్టార్​ రజినీకాంత్​, లోకనాయకుడు కమల్‌హాసన్‌ కలిసి నటించి చాలా ఏళ్లు కాదు.. దశాబ్దాలు అవుతోంది. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్​ సెట్​ అయినట్లు తెలుస్తోంది. 'విక్రమ్‌' డైరెక్టర్​ లోకేశ్​ కనకరాజ్​ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి రజినీ-కమల్​ ప్లాన్​ చేశారట.

ABOUT THE AUTHOR

...view details