తెలంగాణ

telangana

By

Published : Jul 5, 2022, 3:00 PM IST

ETV Bharat / city

Telangana Top News: టాప్​ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News

  • 'నుపుర్'కు మద్దతుగా సీజేఐకి మాజీ జడ్జిల లేఖ..

NUPUR SHARMA SUPREME COURT: భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, సైనికాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు సీజేఐ జస్టిస్ రమణకు బహిరంగ లేఖ రాశారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా న్యాయమూర్తిని ఆదేశించాలని లేఖలో కోరారు.

  • కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ఖైదీలంతా విడుదల!

జైళ్లలో సత్ప్రవర్తన కనబరుస్తున్న ఖైదీలను విడుదల చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా అనేక మందికి కారాగారవాసం నుంచి విముక్తి కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించి.. రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది.

  • 'సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు'

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తెరాస నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి విరుచుకుపడ్డారు. మీర్‌పేట్‌ను సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మీర్‌పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని వెల్లడించారు.

  • మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తిన అధికారులు

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు.. పరవళ్లు తొక్కుతున్నాయి.

  • ఆందోళన బాటపట్టిన ఉపాధ్యాయ సంఘాలు

టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మరోసారి ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్​లోని విద్యాశాఖ కమిషనర్​ కార్యాలయం ముట్టడికి యత్నించారు. తక్షణమే బదిలీలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి.. స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

  • ఆసుపత్రికి వెళ్లా- ప్రియుడితో పారిపోలేదు

ప్రియుడి మోజులో భర్తను వదిలేసి వెళ్లిపోయిన మహిళ.. తన పిల్లల కోసం తిరిగి వచ్చింది. అయితే, తాను ప్రియుడితో పారిపోలేదని మహిళ చెబుతోంది. ఈ క్రమంలో పిల్లల విషయమై భర్తతో వాగ్వాదానికి దిగింది.

  • రెండు పెళ్లిళ్లు చేసుకున్న క్రికెటర్స్​

సినిమా తర్వాత.. ఆ స్థాయిలో ఆదరణ ఉన్నది క్రికెట్​కే అని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ప్రేమ- పెళ్లి- విడాకులు సర్వసాధరణంగా జరుగుతుంటాయి. అయితే భారత క్రికెట్​లో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగానే ఉన్నా.. విడాకులు కాస్త తక్కువే అని చెప్పుకోవాలి. అభిప్రాయ భేదాల వల్లనో.. మరే ఇతర కారణాల వల్లనో.. కొందరు భారత క్రికెటర్లు రెండో పెళ్లి చేసుకున్నారు. వారు ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.

  • భారత​ ఫ్యాన్స్​పై జాత్యహంకార వ్యాఖ్యలు..

ఇంగ్లాండ్‌లో మరోసారి 'జాత్యహంకార' సంఘటన తలెత్తెంది. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. తాజాగా టీమ్​ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ వేదిక ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలోనూ జాత్యహంకార ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. భారత అభిమానుల పట్ల పలువురు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు సోషల్‌ మీడియాలో వీడియో వైరల్​ అయింది. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ఈ ఘటనపై విమర్శలు చేశారు. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్‌ బోర్డు స్పందించింది.

  • ఆయన విమర్శల వల్లే నటుడిగా మెరుగయ్యాను: చిరంజీవి

Gudipudi srihari died: ప్రముఖ సినీ విశ్లేషకులు, సాహితీవేత్త గుడిపూడి శ్రీహరి మృతి పట్ల తెలుగు చిత్రసీమ సంతాపం తెలిపింది. మెగాస్టార్​ చిరంజీవి, పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • జేమ్స్​ కామెరూన్ షాకింగ్​ నిర్ణయం.. 'అవతార్'​ నుంచి ఔట్​

Avatar Director James cameron: హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్​.. ఈ పేరు తెలియని సినీ అభిమానులుండరు. 'ద టెర్మినేటర్‌', 'ఎలియన్స్‌', 'ద ఎబిస్‌', 'ట్రూలైస్‌', 'టైటానిక్‌', 'అవతార్‌' చిత్రాల ద్వారా అద్భుత లోకాలలో ప్రేక్షకులను విహరింపజేసిన సృజనశీలి. ప్రస్తుతం ఆయన.. పండోరా అనే కొత్త లోకాన్ని పరిచయం చేసిన చిత్రం 'అవతార్‌'కు కొనసాగింపుగా సీక్వెల్స్​ను తెరకెక్కిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details