తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​ న్యూస్ @3PM - 3PM టాప్​ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Jul 4, 2022, 2:59 PM IST

  • 'నేను డిక్టేటర్​గా మారతా.. వారి సంగతి చూస్తా'.. సీఎం స్ట్రాంగ్​ వార్నింగ్​!

ప్రజాప్రతినిధులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే తాను నియంతలా మారి కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు తమిళనాడు సీఎం స్టాలిన్​. మహిళా ప్రతినిధులు తమ బాధ్యతలను భర్తలకు అప్పజెప్పకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. తాను ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించానని, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గుర్తుచేసుకున్నారు.

  • 'అవును! మాది ఈడీ ప్రభుత్వమే..'

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు! తమది ఈడీ ప్రభుత్వమేనంటూ వ్యాఖ్యానించారు. అయితే 'ఈడీ' అంటే అర్థం ఏక్​నాథ్- దేవేంద్ర ప్రభుత్వమని వివరణ ఇచ్చారు.

  • 'అల్లూరి స్ఫూర్తిని కొనసాగించాలి'

ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

  • 'అగ్నిపథ్'​పై వచ్చే వారం సుప్రీం విచారణ

దేశంలో సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమైనప్పుడు వాదనలు వింటామని వెకేషన్​ బెంచ్​ తెలిపింది.

  • మోదీ జీ.. కేసీఆర్‌ ప్రశ్నలకు సమాధానాలేవీ? : తలసాని

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చప్పగా సాగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేశామని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటని.. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

  • కారు డెలివరీ ఆలస్యం.. మనస్తాపంతో..

సొంతంగా కారు కొనుక్కుని కిరాయిలకు తిప్పుతూ ఉపాధి పొందాలనుకున్నాడు. ఏ కారు కొనాలో షో రూమ్​కు వెళ్లి చూసుకున్నాడు. డౌన్​ పేమెంట్​కు సరిపడా డబ్బులు లేకపోవడంతో కొంతమొత్తాన్ని కట్టి.. కారును బుక్​ చేసుకున్నాడు. మిగతా సొమ్ము చెల్లించాక కారు డెలివరీ ఇస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఇంటికొచ్చేశాడు.

  • ప్రేమన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు.. తల్లి కాగానే..

ఓ గర్భిణీ తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అత్తామామల మాట విని తన భర్త తనను వదిలిపెట్టి పారిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి ఫిర్యాదు ఇచ్చినా.. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయింది.

  • ఈ యాప్స్​తో మీ బడ్జెట్​ లెక్కలు మరింత పక్కా! డిస్కౌంట్స్​ కూడా!!

ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సాంకేతికత ప్రధాన భూమిక పోషిస్తోంది. కరోనా తర్వాత ఆర్థిక సేవల రంగంలో దీని పరిధి మరింత విస్తృతమైంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు, పెట్టుబడులు, బీమా పాలసీల దగ్గర్నుంచి ప్రతీదీ ఆన్‌లైన్‌ బాట పట్టాయి. మరి, మీ ఆర్థిక ప్రణాళికల్లోనూ డిజిటల్‌ను ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామా..

  • మసాజ్​ చేయమని, బట్టలు ఉతకమని టార్చర్​ పెట్టారు: స్టార్​ స్ప్రింటర్​ ద్యుతి

దేశంలోనే అత్యంత వేగవంతమైన మహిళా రన్నర్‌గా పేరున్న ద్యుతి చంద్​.. తాను ఎదుర్కొన్న వేధింపుల సమస్యను బయటపెట్టింది. తనను బలవంతంగా మసాజ్​ చేయమని, బట్టలు ఉతకమని టార్చర్​ పెట్టారని తెలిపింది.

  • హృదయాన్ని హత్తుకుంటున్న 'సీతారామం' సాంగ్​

శ్రీవిష్ణు హీరోగా.. పోలీస్‌ అధికారి ఫిక్షనల్‌ బయోపిక్‌గా రూపొందుతున్న సినిమా 'అల్లూరి'. తాజాగా ఈ మూవీ టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. మరోవైపు దుల్కర్​ సల్మాన్​ నటించిన 'సీతారామం'లోని సెకండ్ సాంగ్​​ విడుదలై హృదయాన్ని తాకేలా ఉంది.

ABOUT THE AUTHOR

...view details