తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2021, 10:03 PM IST

ETV Bharat / city

BADVEL BY POLL: బద్వేలు ఉప ఎన్నికకు 35 మంది నామినేషన్లు

ఏపీలోని కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికకు నామినేషన్​ గడువు ముగిసింది. నామపత్రాలను ఈనెల 11 పరీశీలన చేయనున్నారు. ఈనెల 30న పోలింగ్​ జరగనుండగా.. నవంబర్​ 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.

BADVEL BY POLL
BADVEL BY POLL

ఏపీలోని కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 35మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గడువులోగా వచ్చినవారి నుంచీ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. శుక్రవారం ఒక్కరోజే 20 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ వేసిన వారిలో వైకాపా, భాజపా, కాంగ్రెస్‌, స్వతంత్రులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 11న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు 13 వరకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

వైకాపా అభ్యర్థి నామినేషన్...

కడప జిల్లా బద్వేలు ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్​కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పాల్గొన్నారు.

భాజపా అభ్యర్థి ఎవరంటే..

బద్వేలు ఉపఎన్నికలో (badvel by- election) భాజపా అభ్యర్థిగా పనతల సురేష్​ నామినేషన్​ వేశారు. పెనగలూరు మండలానికి చెందిన సురేష్‌.. 2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏబీవీపీ తరఫున, భాజపా తరఫున జిల్లాలో అనేక ఉద్యమాలు చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్...

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక(badvel by-poll) అసెంబ్లీ స్థానానికి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొట్టిపోగు కమలమ్మ(congress candidate kamalamma) నామినేషన్ వేశారు. ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్​తో కలిసి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్​కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. కడప జిల్లా(kadapa district) నిండుకుండలా మారిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని శైలజానాథ్ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

జనసేన, తెదేపా దూరం

బద్వేలు ఉపఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెదేపా(TDP) నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు(chandrababu) అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశం(polit bureau meeting)లో..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే.. అధికార వైకాపా టికెట్‌ ఇవ్వటంతో.. ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించినట్లు తెదేపా తెలిపింది.

బద్వేలు ఉపఎన్నికలో జనసేన(janasena) పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత పవన్​ కల్యాణ్(pawan kalyan)​ వెల్లడించారు. మరణించిన ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇచ్చినందున మానవతా దృక్పథంతోనే బద్వేలులో పోటీ చేయడం లేదన్నారు. నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదీచూడండి:Huzurabad by election: ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల​ ఘట్టం.. ప్రచారాలపై ఈసీ ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details