ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,309 మందికి వైరస్ సోకింది. కొవిడ్ బారినపడి 12 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.
ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు, 12 మంది మృతి - భారతదేశంలో కరోనా వైరస్
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 3,309 కరోనా కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి.
కరోనా వైరస్ వార్తలు
వైరస్ నుంచి ఈ రోజు 1,053 మంది కోలుకోగా.. ప్రస్తుతం 18,666 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 31,929 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:థియేటర్లో అభిమానుల వీరంగం...